![]() |
![]() |

బుల్లితెర మీద నటించేవాళ్ళు ఒక మెట్టు ఎక్కుతూ అటు సినిమా డైరెక్టర్స్ గా ఇటు యాక్టర్స్ గా మారిపోతున్నారు. ఇక ఇప్పుడు మానస్ వంతు వచ్చింది ఐతే మానస్ అటు సినిమాల్లోకో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో కాదు వెళ్తోంది. మానస్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పిక్ పెట్టాడు. "హోస్టింగ్ నుంచి కామెంటరీకి వెళ్తున్నా. ఐపిఎల్ 2024 కి కామెంటరీ చెప్తున్నా..ప్రతీ శనివారం స్టార్ స్పోర్ట్స్ తెలుగు చూడండి" అంటూ ఒక టాగ్ లైన్ పెట్టాడు. ఇప్పటికే క్రికెట్ అంటే ఎంతో ఫ్యాషన్ తో ఉండే నందు కూడా క్రికేట్ కామెంటేటర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు మానస్ కూడా కామెంటేటర్ గా మారిపోయాడు. దానికి సంబంధించిన మేకప్, ఐపిఎల్ కామెంటరీ రూమ్ లోకి ఎంట్రీ మొత్తం వీడియోని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. మానస్ ఇప్పటికే బుల్లి తెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గా స్టార్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం "బ్రహ్మముడి" సీరియల్ లో రాజ్ క్యారెక్టర్ లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే మరో వైపు స్టార్ మాలో " నీతోనే డాన్స్ 2 . 0 " కొత్త సీజన్ లో శుభశ్రీ రాయగురుతో కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మానస్ కి ఇప్పుడు చేతి నిండా పని ఉంది. అంతే కాదు కొంత కాలం క్రితం వరకు విష్ణుప్రియతో కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు జిమ్ లో బాడీ పెంచి కండలు పెంచి కొత్త కొత్త షోస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి తనను తాను ఎలివేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక నెటిజన్స్ ఐతే "అన్న లక్కింగ్ హాట్, చాలా బాగున్నారు. ఆల్ ది బెస్ట్, సూపర్ అన్నా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బుల్లితెర మీద చాలా షోస్ కి హోస్టింగ్ కూడా చేసిన మానస్ కామెంటరీ ఇవ్వడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటున్నారు మానస్ ఫాన్స్.
![]() |
![]() |